మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి
పోటు రంగారావు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ప్రభుత్వం అర్హులెవరికీ అన్యాయం జరగకుండా విచారణ జరిపి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటు రంగారావు మాట్లాడుతూ సీఎం, మంత్రులు ఆదేశించారంటూ అధికారులు హడావిడిగా కొన్ని పేర్లు ఎంపిక చేసినా అందులో నిజమైన అర్హుల పేర్లు లేవన్నారు. మధ్యవర్తుల ప్రమేయంతో నివాసాలు ఉన్న వారికే ఇళ్లు వచ్చినందున అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన సూచించారు.
ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని ఖండించాలి
ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని భారత్ తరఫున ఖండించాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఆదానీ కేసు, అంబానీ పెట్టుబడులకు అమెరికాలో లాభం చేకూర్చేలా ప్రధాని మోదీ అమెరికా ముందు తలవంచుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ యుద్ధాన్ని భారత్ ఖండించి శాంతి నెలకొనడానికి కృషి చేయాలన్నారు. ఇదేసమయాన యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై భారాలు మోపొద్దని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు గుండా సత్యనారాయణరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, వరగాని కోటేశ్వరరావు, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, మలీదు నాగేశ్వరరావు, కొలేటి నాగేశ్వరరావు, సీహెచ్.శిరోమణి, టి.ఝాన్సీ, మంగతాయి, శోభ, ఆజాద్, శ్రీనివాస్, కవిత, అనిత తదితరులు పాల్గొన్నారు.


