బంకుల్లో మోసాలకు తావు లేదు
ఎర్రుపాలెం: పెట్రోల్ బంక్‌ల్లో వినియోగదారులను మోసం చేసేందుకు తావు లేదని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి బి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఇటీవల మండలకేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొలతల్లో తేడాలు రావడంతో వినియోగదారులు పౌరసరఫరాల అధికారులకు, మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రవీణ్‌కుమార్, సివిల్ సప్లై డీటీ ప్రసన్న సోమవారం పెట్రోల్ బంక్‌ను, రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్రోల్ పంప్‌ను సీజ్ చేశారు. శాంపిళ్లు ల్యాబ్‌కు పంపించి తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బంక్‌ల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. టాయిలెట్లు, ఎయిర్, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.


