ఉపకార వేతనాలకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఉపకార వేతనాలకు దరఖాస్తులు

Jan 3 2026 6:53 AM | Updated on Jan 3 2026 6:53 AM

ఉపకార

ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఖమ్మంమయూరిసెంటర్‌: కార్మికుల పిల్లలు ఉపకార వేతనాల కోసం వచ్చేనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ పి.కృష్ణవేణి సూచించారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక లేదా ట్రస్టుల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 2024–25 విద్యాసంవత్సరం ఫలితాల ఆధారంగా ఉపకార వేతనాలు అందుతాయని వెల్లడించారు. ఎస్సెస్సీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధిస్తే రూ.వేయి, పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైతే రూ.1,500, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్లుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.2 వేలు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే మే డే నాటికి ఖాతాల్లో ఉపకార వేతనం జమ అవుతుందని ఆమె తెలిపారు.

రిజర్వేషన్‌ కౌంటర్‌ను ప్రారంభించిన ఆర్‌ఎం

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం కొత్త బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ను రీజినల్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ శుక్రవారం ప్రారంభించారు. టికెట్ల బుకింగ్‌ కోసం వచ్చే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, ఖమ్మం, భద్రాచలం డీఎంలు శివప్రసాద్‌, జంగయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్‌

బోనకల్‌: గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్‌ అందించేలా యూనిట్లు ఏర్పాట్లుచేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఖమ్మం ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. బోనకల్‌లో శుక్రవారం ఆయన పలువురి ఇళ్లపై సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు పనులను పరిశీలించి మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని రెండు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలుచేస్తోందని తెలిపారు. మధిర నియోజకవర్గం బోనకల్‌ మండలంలోని 22 గ్రామాల్లో ఈ పథకం కింద సౌర ప్లాంట్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరడంతో నెలాఖరులోగా సోలార్‌ వెలుగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.1.40 లక్షల విలువైన సోలార్‌ ప్యానళ్లను ప్రభుత్వమే ఏర్పాటుచేయిస్తోందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వినియోగదారుల అవసరాలకు వాడుకుని మిగిలితే ప్రభుత్వమే కొనుగోలు చేసి నగదును ఖాతాల్లో జమ చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లకు కూడా త్వరలోనే ఈ విధానం అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఎస్‌ఈ తెలిపారు. రెడ్‌కో జిల్లా మేనేజర్‌ అజయ్‌బాబు, డీఈ బండి శ్రీనివాసరావు, ఏఈఈ మనోహర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ శేషగిరిరావు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలి

ఖమ్మంరూరల్‌: మున్సిపాలిటీల ఎన్నికలకు ఎప్పుడు జరిగినా పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఆమె సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం, మధిర మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, ఉద్యోగుల ఎంపిక, శిక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను త్వరగా గుర్తించి అవసరమైన వసతుల కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కమిషనర్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రామచంద్రరావు, నరసింహం, గురులింగం, సంపత్‌కుమార్‌, డీపీఓ రాంబాబు, జిల్లా క్రీడల అధికారి సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపకార వేతనాలకు  దరఖాస్తులు
1
1/2

ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఉపకార వేతనాలకు  దరఖాస్తులు
2
2/2

ఉపకార వేతనాలకు దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement