లఘు చిత్రం నటులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

లఘు చిత్రం నటులకు సత్కారం

Jan 5 2026 10:58 AM | Updated on Jan 5 2026 10:58 AM

లఘు చ

లఘు చిత్రం నటులకు సత్కారం

తిరుమలాయపాలెం: తెలుగు భాషను కాపాడే ఉద్దేశంతో గుంటూరులో నిర్వహించిన ప్రపంచ మూడో తెలుగు మహాసభల్లో లఘు చిత్రాలను ప్రదర్శించారు. అందులో కొత్తపల్లి శేషు దర్శకత్వంలో నిర్మించిన ‘మహాశయులు మళ్లీ పుట్టండి’ప్రత్యేక బహుమతి సాధించింది. అందులోని నటులు, తిరుమలాయపాలెంనకు చెందిన కొమ్ము రమేశ్‌, కొమ్ము అజితతోపాటు కొత్తపల్లి శేషును సన్మానించారు.

6న రాష్ట్రస్థాయి

‘గణిత’ పోటీలు

ఖమ్మం సహకారనగర్‌: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోటీలు ఈనెల 6వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరుగుతోందని, ఈ పరీక్షకు జిల్లా నుంచి పలువురు వెళ్తున్నారని గణితం ఫోరం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, జనరల్‌ సెక్రటరి రఘు, ట్రెజరర్‌ ఉపేంద్రయ్య, స్టేట్‌ సెక్రటరి మౌలానీ తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం నుంచి టి.గణేష్‌ రెడ్డి, సీహెచ్‌.మహేష్‌, వై.కీర్తిరెడ్డి, తెలుగు మీడియం నుంచి ఎం.భవాని, ఎం.వైష్ణవి, డి.కవిత, గురుకుల విభాగం నుంచి ఎస్‌కె.సాయి మొగల, వై.రోహిత్‌, ఎస్‌.గోపాలకృష్ణ, ఉర్దూ మీడియం నుంచి ఎండీ.ఆశ్రీయా, ఎస్‌డీ.మునతాహ్‌, ఎస్‌కే సల్మా తదితరులు హాజరవుతున్నారని వివరించారు.

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ..

దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం – తూరుబాక గ్రామాల మధ్య అదుపుతప్పిన లారీ (టీజీ 04 టీ 4959) చెట్టును ఢీకొట్టింది. ఇసుక లోడ్‌ కోసం వస్తున్న లారీని క్లీనర్‌ మద్యంలో డ్రైవింగ్‌ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో డ్రైవర్‌ మద్యం అధికంగా సేవించి నిద్రపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ చేపట్టారు.

ఇసుక లారీ సీజ్‌

దమ్మపేట: అనుమతులు లేకుండా ఏపీ నుంచి మండలానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని దమ్మపేట పోలీసులు సీజ్‌ చేశారు. మండలంలోని వడ్లగూడెం శివారులో అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఏపీలోని రాజమండ్రి నుంచి దమ్మపేటకు ఇసుకను తరలిస్తున్నట్టు తేలడంతో లారీని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

నాటుసారాపై ఉక్కుపాదం మోపుతాం

కరకగూడెం: నాటుసారా నియంత్రణలో భాగంగా మణుగూరు ఎకై ్సజ్‌ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని కలవలనాగారం శివారులోని అటవీ ప్రాంతంలో 1000 కిలోల బెల్లం, 15 కిలోల పటిక, 6 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన భూక్యా రామదాసు, ఇస్లావత్‌ బన్సీలాల్‌, వాంకుడోత్‌ బాబూరావు, కుంసోత్‌ సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ రాజిరెడ్డి వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది వెంకట అప్పారావు, ప్రసన్న, సతీశ్‌ పాల్గొన్నారు.

ఐటీసీ కార్మికుడికి గాయాలు

బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో విధి నిర్వహణలో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. పీఎం–1ఏలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుడు బత్తుల కిశోర్‌ చేయి ప్రమాదవశాత్తు రివైండర్‌లో పడింది. తీవ్రంగా గాయపడటంతో అతడిని తోటి కార్మికుల సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కార్మికుడిని ఐటీసీ కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు.

లఘు చిత్రం  నటులకు సత్కారం1
1/2

లఘు చిత్రం నటులకు సత్కారం

లఘు చిత్రం  నటులకు సత్కారం2
2/2

లఘు చిత్రం నటులకు సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement