నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం

Jan 5 2026 10:58 AM | Updated on Jan 5 2026 10:58 AM

నల్ల

నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం

కూసుమంచి: మండలంలోని నాయకన్‌గూడెం, కోక్యాతండా గ్రామాల్లో శనివారం రాత్రి ఎకై ్సజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నల్లబెల్లం, నాటుసారా, పటిక పట్టుబడింది. ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కథనం ప్రకారం.. నాయకన్‌గూడెంనకు చెందిన వంకాయల జనార్దన్‌, నాంపల్లి ధనలక్ష్మి, కోక్యాతండాకు చెందిన బాణోత్‌ నరేశ్‌ ఆటోలో 4 క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కిలోల పటిక, 10 లీటర్ల నాటుసారాను కోక్యాతండాకు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసి, ఆటో, నల్లబెల్లం, పటిక, నాటుసారా స్వా ధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.

రుణమాఫీ అంటూ

రైతుకు టోకరా

కూసుమంచి: ఓ రైతు వద్ద నుంచి రుణమాఫీ పేరుతో రూ.20 వేలు స్వాహా చేసిన ఘటన మండలంలో ఆదివారం వెలుగుచూసింది. మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావుకు సైబర్‌ మోసగాడు ఫోన్‌ చేసి రూ.20వేలు చెల్లిస్తే పంట రుణం రూ.2లక్షల వరకు మాఫీ అవుతుందని నమ్మించాడు. దీంతో సదరు రైతు అతడికి రూ.20వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. తర్వాత బ్యాంకుకు వెళ్లి విచారించగా తాము ఎలాంటి ఫోన్‌ చేయలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

పేకాట స్థావరాలపై దాడి

వైరారూరల్‌: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో ఆదివారం రాత్రి ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచా రం మేరకు ఎస్‌ఐ పుష్పాల రామారావు దాడులు నిర్వ హించారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.5,350 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెల్లడించారు. కానిస్టేబుళ్లు నర్సింహారావు, రామారావు దాడుల్లో పాల్గొన్నారు.

కేసులు నమోదు..

చింతకాని: వేర్వేరు ఘటనల్లో మండలంలోని రామకృష్ణాపురం, నాగులవంచ గ్రామాలకు చెందిన వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వీరేందర్‌ కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన హనుమంతురావుకు తన భార్య సునీతకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా యి. ఈ క్రమంలో భార్యపై రాయితో దాడి చేయగా గాయాలయ్యాయి. భార్య ఫిర్యాదు మేరకు హనుమంతరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే, నాగులవంచ గ్రామానికి చెందిన కోటి.. ఓ వివాహితను వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతున్న

వ్యక్తి మృతి

బూర్గంపాడు: గత డిసెంబర్‌ 22న పురుగుమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వలస ఆదివాసీ గ్రామం రాజీవ్‌నగర్‌కు చెందిన కుంజా జోగయ్య (28) కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై.. ఏ పనికి వెళ్లకుండా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 22న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు భద్రు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనారోగ్యంతో

బీటీపీఎస్‌ ఉద్యోగి..

పాల్వంచ: అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న బీటీపీఎస్‌ ఉద్యోగి రోడ్డు పక్కనే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన బీటీపీఎస్‌ ఫోర్‌మెన్‌ రామాల థామస్‌ (56) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం మద్య ం సేవించేందుకు బయటకు వెళ్లిన థామస్‌ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు పక్కనే పడి మృతి చెందాడు. అయితే, గతంలో అతడికి ఫిట్స్‌ ఉందని, అనారోగ్యంతో మృతి చెందాడని భార్య ఝాన్సీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐసుమన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న

యువకుడు..

ఇల్లెందురూరల్‌: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్‌ (30) డిసెంబర్‌ 28వ తేదీన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం

నేలకొండపల్లి: బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండకు చెందిన కట్టెకోల మల్లేశం, అనంతు నాగేందర్‌రావు బైక్‌పై ఆదివారం ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. గోకినేపల్లి–గువ్వలగూడెం మధ్య జాతీయ రహదారిపై డీసీఎం వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఖమ్మం వైద్యశాలకు తరలించారు.

నల్ల బెల్లం,  నాటు సారా స్వాధీనం1
1/1

నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement