రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఖమ్మంక్రైం: ఈనెల 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాలను గురువారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని సూచించారు. అంతేకాక వాహనదారులు అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం రవాణా శాఖ ఉద్యోగులతో కలిసి ఆయన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆతర్వాత జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో పలువురు డ్రైవర్లకు అవగాహన కల్పించి భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వరప్రసాద్, ఆర్‌టీఓ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, దినేష్, రవిచంద్ర, సిబ్బంది సరిత, లక్ష్మి, ప్రసన్న, నిశ్చల తదితరులు పాల్గొన్నారు.


