డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు

Jan 2 2026 11:24 AM | Updated on Jan 2 2026 11:24 AM

డిప్య

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు

ఖమ్మంమయూరిసెంటర్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కలిశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కబడ్డీ టోర్నీ విజేత

చెరువుమాధారం

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో పలు ప్రాంతాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో చెరువుమాధారం జట్టు విజేతగా నిలవగా, కోదాడ, కల్లూరు, కోదాడ(బీ), చెరువుమాధారం ఆటో యూనియన్‌ జట్లు ఆతర్వాత స్థానాల్లో నిలిచాయి. ఆయా జట్లకు సర్పంచ్‌ అమరగాని ఎల్లయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూరేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అన్నదానానికి

రూ. లక్ష విరాళం

భద్రాచలంటౌన్‌: జూనియర్‌ కళాశాల సెంటర్‌లోని శ్రీ సాయిబాబా ఆలయంలో అన్నదానానికి పట్టణానికి చెందిన ఉంగరాల వెంకట్రావు–లక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయిదీప్‌ పుట్టినరోజును పురస్కరించుకుని రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ నిధులతో గురువారం సుమారు 1,400 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

క్రీడాకారిణికి సన్మానం

బోనకల్‌: ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన చాపలమడుగు శశికళను పలువురు సన్మానించారు. మండలంలోని చిరునోములకు చెందిన ఆమె సర్పంచ్‌ అనుమోలు చంద్రకళ, ఉప సర్పంచ్‌ నిమ్మతోట రఘు, వార్డు సభ్యులతో పాటు బోనకల్‌ కళాశాల అధ్యాపకులు వేర్వేరుగా సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్‌ నళినిశ్రీ, అధ్యాపకులు అంతోటి తిరుపతిరావు, ప్రేమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టోల్‌గేట్‌ వద్ద

1033 అంబులెన్స్‌లు

నేలకొండపల్లి: జాతీయ రహదారిపై ఎక్కడో ఓ చోట తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు తరలించేలా నేషనల్‌ హైవే ఆఫ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు టోల్‌గేట్ల వద్ద 1033 నంబర్‌తో అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్‌గేట్‌ వద్ద రెండు అంబులెన్స్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. క్షతగాత్రులు 108 వాహనాలతో పాటు 1033 వాహనాల సేవలు కూడా పొందొచ్చని అధికారులు సూచించారు. ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వాహనాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

ఆదివాసీ కాంగ్రెస్‌

వైస్‌ చైర్‌పర్సన్‌గా చంద్రకళ

టేకులపల్లి: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు పూనెం చంద్రకళ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అనుబంధ ఆదివాసీ కాంగ్రెస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నుంచి నియామక పత్రం విడుదలైందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గురువారం టేకులపల్లిలో ఆమెను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కోరం హనుమంతు, నాయకులు భూక్యా దేవానాయక్‌, కోరం మహాలక్ష్మి, బండ్ల రజిని, రాసమల్ల నరసయ్య, ఎనగంటి అర్జున్‌రావు, బోడ సరిత తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు1
1/3

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు2
2/3

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు3
3/3

డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement