కష్టాలు..కడగండ్లు
వానాకాలంలో సాగైన
కొన్ని పంటల వివరాలు
వర్షపాతం (మి.మీ.ల్లో)
ధర ప్రభావంతో పడిపోయిన మిర్చి సాగు
ప్రోత్సాహకాలతో పెరిగిన ఆయిల్‌పామ్
యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఆయిల్‌పామ్‌పై ఆసక్తి
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రైతులకు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు ఎదురయ్యాయి. జూన్ మినహా జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో వరి, పత్తి పంటలు లక్ష్యానికి మించి సాగు చేశారు. అయితే, మధ్యమధ్య భారీ వర్షాలు, తుపాన్లతో పంట నష్టం కూడా అదేస్థాయిలో నమోదైంది. ఇక యూరియా కొరతతో ఇక్కట్లు ఎదుర్కొనగా, ధర ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా మిర్చి సాగు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది రైతులకు మిశ్రమ ఫలితాలే మిగిలాయి. – ఖమ్మంవ్యవసాయం
జిల్లాలో గతేడాది 59,235 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది 31,713 ఎకరాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రధానంగా సాగయ్యే ‘తేజా’ రకం మిర్చికి విదేశాల నుంచి ఆర్డర్లు రాకపోవడం, క్వింటాకు రూ.20 వేల వరకు పలికిన ధర సీజన్‌లో రూ.12 వేలు దాటకపోవడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. తెగుళ్ల బెడదతోనూ రైతులు మిర్చిని వదిలేసి పత్తి, ఇతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు.
పంటల ఉత్పతి దశలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వానలతో పాటు అక్టోబర్‌లో మోంథా తుపాను కారణంగా పూత, కాత దశలో ఉన్న పత్తికి నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి ఐదు క్వింటాళ్లు దాటలేదు. ఆగస్టులో కురిసిన వానలతో 3,635 మంది రైతులకు చెందిన 4,654.16 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇక మోంథా తుపానుతో 4,268 మంది రైతులకు చెందిన 4,275 ఎకరాల్లో వరి, పత్తి, కంది, మినుము, పెసర, టమాట పంటలకు నష్టం వాటిల్లింది.
పంట రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల వరకు మాఫీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో 1,31,760 మంది రైతులకు రూ.912.61 కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. ఇక పంటల సాగుకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున గత వానాకాలం సీజన్‌లో 3,37,898 మంది రైతులకు రూ.427.264 కోట్లు చెల్లించింది.
వానాకాలంలో కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంది. సాగర్ ప్రాజెక్టులోనూ నీరు ఉండడంతో యాసంగి సాగుకు ఢోకా లేనట్టేనని భావిస్తున్నారు. ఈసారి వరి 2.46 లక్షలు, మొక్కజొన్న 1.60 లక్షల ఎకరాలతో పాటు అన్నీ కలిపి 4.16 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న సాగుపై రైతులు దృష్టి సారించగా ఇప్పటికే వెదజల్లే పద్ధతిలో వరి వేస్తున్నారు. ఇంకొందరు నారు పోశారు.
ఈ ఏడాది విస్తారమైన వర్షాలతో జిల్లాలో పంటల సాగు సంతృప్తికరంగా సాగింది. వరి సాగు విస్తీర్ణం పెరగడమే కాక దిగుబడి, ధర ఆశాజనంగా ఉన్నాయి. అధిక వర్షాలతో పత్తి దిగుబడి కొంత మేర తగ్గింది. ధర ప్రభావంతో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
పంట విస్తీర్ణం (ఎకరాల్లో)
వరి 3,03,490.33
పత్తి 2,56,211.10
మొక్కజొన్న 1,970.28
ఆయిల్‌పామ్ 40,065
మిరప 31,713
మామిడి 31,241
కూరగాయలు 1,208
నెల సాధారణం నమోదు
జూన్ 131.2 123.9
జూలై 240.9 281.6
ఆగస్టు 240.0 389.7
సెప్టెంబర్ 179.0 241.1
పంటల సాగు లక్ష్యాన్ని దాటినా దెబ్బతీసిన తుపాన్లు
ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో రెండు పరిశ్రమలు, ఇక్కడి నేలలు, నీటి వనరులు అనుకూలంగా ఉండడంతో పంట సాగుకు మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 10,459 మంది రైతులు 40,345.34 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
కష్టాలు..కడగండ్లు
కష్టాలు..కడగండ్లు
కష్టాలు..కడగండ్లు
కష్టాలు..కడగండ్లు
కష్టాలు..కడగండ్లు


