గంజాయి గాడీ!
కట్టుదిట్టం చేస్తున్నా
ఆగని రవాణా
● ఒడిశా నుంచి మహారాష్ట్రకు సరఫరా ● కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంటున్న రవాణాదారులు ● జీఆర్పీ పోలీసులు తనిఖీ చేస్తున్నా ఆగని దందా
ఖమ్మంక్రైం: ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఖమ్మం మీదుగా గంజాయి రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవా ణాకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అక్రమార్కులు ఉపయోగించుకుంటున్నారు. జీఆర్పీ పోలీసుల తనిఖీల్లో కొందరు అప్పుడప్పుడూ పట్టుబడుతున్నా రవాణా మాత్రం ఆగడం లేదు.
అక్కడ విస్తృతంగా సాగు
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున గంజా యిని సాగు చేస్తూ ఉంటారు. దీనికి మహారాష్ట్రలోని ముంబై, పుణే ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో భువనేశ్వర్ నుంచి వచ్చే కోణా ర్క్ ఎక్స్‌ప్రెస్‌ను గంజాయి స్మగ్లర్లు వినియోగించుకుంటున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు స్మగ్లర్లు పలువురు నిరుపేదలను ఎంచుకుని వారికి డబ్బు ఎరవేసి గంజాయి రవాణా సాగిస్తున్నారు.
చిక్కేది బాధితులే..
జీఆర్పీ పోలీసుల తనిఖీల్లో గంజాయితో పట్టుబడినవారిలో చిన్నాచితకా వ్యక్తులేనని చెపాలి. అసలు స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారో పోలీసుల విచారణలో బయటపడే పరిస్థితి ఉండదు. ఒకవేళ చెప్పి నా వారిని పట్టుకోవటానికి ఆధారాలు ఉండవని, వారు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లలేరని పోలీసుల ద్వారా తెలిసింది. ఒడిశా ప్రాంతంలో గంజాయి సాగు చేసే ప్రాంతాలకు వెళ్లగలిగినా తిరిగి రావడం కష్టమని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రూ.20 లక్షలకు పైగా సరుకు స్వాధీనం
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోనే రూ.22 లక్షలకు పైగా విలువైన గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.3లక్షల విలువైన గంజాయి లభించింది. ఆయా కేసుల్లో పదిమందిని అరెస్ట్ చేశారు. వీరంతా ఒడిశా రాష్ట్రంలోని భువనే శ్వర్, బరంపూర్ జిల్లాల వారే కావడం గమనార్హం. దీంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఏమేర గంజాయి స్మగ్లింగ్ నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాగా, సిబ్బంది కొరతతో పూర్తిగా రవాణాను అరికట్టలేకపోతున్నామని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు.
గంజాయి రవాణాను ఆరికట్టడానికి నిత్యం ఖమ్మం జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేస్తున్నా రవాణా ఆగ డం లేదు. తనిఖీల సమయాన గంజాయితో ఒకరిద్దరు పట్టుబడుతున్నారు. మిగతా వారు తప్పించు కుని గంజాయిని దొంగచాటుగా తరలించేస్తున్నా రు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నప్పుడు వారి దృష్టిని మర్చలడానికి ఒకరిద్దరిని ముందు ఉంచి.. మిగతా వారు తమ పని కానిచ్చేస్తున్నట్లు సమాచారం.


