కేయూ క్రికెట్ విజేత ‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్’
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు టైటిల్ దక్కించుకుంది. ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ – జీడీసీ పాల్వంచ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ జట్టు పరిమిత ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ తర్వాత పాల్వంచ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. అంతకు ముందు జరిగిన రెండో సెమీస్‌లో కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల జట్టుపై జీడీసీ పాల్వంచ జట్టు విజయం సాధించింది. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న ట్రోఫీలు అందజేయగా, పీడీలు జి.గోపీకృష్ణ, డాక్టర్ పెరుమాండ్ల కోటేశ్వరరావు, జె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెండో స్థానంలో జీడీసీ పాల్వంచ


