అలరించిన సినీ సంగీత విభావరి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి స్వర సుధ కల్చరల్ యూనిట్ ‘మదిలో వీణలు మ్రోగే’పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కళాభిమానులను అలరించింది. గాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు, గాయనీ, గాయకులు పాటలు పాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆదిరాజు పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మీనారాయణ, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఏఎస్ కుమార్, సెలవోటి చంద్రమోహన్, ఎస్.ప్రకాష్, ఆరేపల్లి పున్నయ్య, ఎస్వీ రమణ, మోహన్‌రావు, మాలతీనాయుడు, జనార్దన్, దేవీప్రియ, శ్రీదేవి, స్నేహ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


