ఘనంగా ప్రిజన్ మినిస్ట్రీ జూబ్లీ వేడుకలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రిజన్ మినిస్ట్రీ జూబిలీ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి చైర్మన్, ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బిషప్ మాట్లాడుతూ.. కారాగారంలో మగ్గుతున్న ఎంతోమంది జీవితాలలో వెలుగులు చూడాలని, త్వరలో వారికి విడుదల కలగాలని, వెలుపల ఉన్న వారి కుటుంబాలను పరామర్శించి వారిని ఆదుకుంటామని తెలిపారు. సమాజంలో హింసకు తావు లేకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిని, 25 ఏళ్ల నుంచి ఉపదేశకులుగా సేవలందించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఫాదర్‌లు ఐజాక్, సురేశ్, విజయ్, కొమ్ము అంతోని, జూర్నిస్, కొమరవెల్లి జోసెఫ్, వికార్, తప్పట శౌరి తదితరులు పాల్గొన్నారు.


