కేసు నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి
ఖమ్మంవ్యవసాయం: అటవీ, వన్యప్రాణుల కేసుల్లో దర్యాప్తు, అభియోగాలు సమర్థవంతంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం అటవీశాఖ కార్యాలయంలో అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎ.శంకర్, అదనపు ప్రాసిక్యూటర్లు, అటవీ శాఖ అధికారులు, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీ, వణ్య ప్రాణుల కేసుల నమోదు, సరైన దర్యాప్తు, నిర్వహణ, సంబంధిత న్యాయస్థానాల్లో అభియోగాలపై చర్చించారు. న్యాయ స్థానాల ముందు కేసులను సమర్థవంతంగా ప్రస్తావించేందుకు అటవీ శాఖ, ప్రాసిక్యూషన్ శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు పేర్కొన్నారు.


