చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..
50 ఏళ్ల క్రితం నాటిన
మొక్క మహావృక్షమైంది
స్వర్ణోత్సవాల్లో భద్రాద్రి కలెక్టర్ జితేశ్
వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్
పాల్వంచరూరల్: విద్యాలయాల్లో సౌకర్యాలు ఉన్నా, లేకున్నా.. చదువుకోవాలనే పట్టుదల ఉండాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఐ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా పూర్వ విదార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ఆదివారం వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గిరిజన గురుకులంలో 50 ఏళ్ల క్రితం నాటిన మొక్క మహావృక్షమైందన్నారు. విద్యార్థులు ఉన్న వనరులు, అవకాశాలను వినియోగించుకుంటూ చదువుకోవాలనే కసి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కాగా, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ ఉపాధ్యాయులు ఎన్.చక్రవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌సీఓ అరుణకుమారి, ఏపీఓ డేవిడ్‌రాజు, ప్రిన్సిపాల్ రమేశ్, ఎస్.శ్యామ్‌కుమార్, ఖాదర్, రమేశ్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..


