కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్ కోడ్లు
ఖమ్మంమయూరిసెంటర్: 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. సీఐటీయూ ఖమ్మం జిల్లా మహాసభలను ఆదివారం ప్రారంభిస్తూ వారు మాట్లాడారు. ఈ మహాసభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు బి.మధు, సాంబశివరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, విష్ణువర్ధన్, వై.విక్రమ్, రమ్య పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక..
సీఐటీయూ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ నేతలు తెలిపారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, కోశాధికారిగా చలమల విఠల్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులుగా వై.విక్రమ్, పిన్నింటి రమ్య, ముదాం శ్రీనివాస బండారు యాకయ్య, దొంగల తిరుపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శులుగా శీలం నరసింహరావు, జిల్లా ఉపేందర్, కోటేశ్వరి, తిరుమలచారి, ప్రసాద్, ఎస్.నవీన్‌రెడ్డి, మ్లూరి చంద్రశేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభల్లో పలు తీర్మాణాలు చేసి ఆమోదించడం జరిగిందన్నారు.


