మోడ్రన్ కబడ్డీ విజేత మేడ్చల్..
కామేపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో మేడ్చల్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆ జట్టు నల్లగొండపై విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో నల్లగొండ, తృతీయ స్థానంలో హైదరబాద్, నాలుగో స్థానంలో కరీంనగర్ జట్లు నిలిచాయి. మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి నేతృత్వంలో ఈ పోటీలు జరగగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్‌ఐ శ్రీకాంత్, గింజల నరసింహారెడ్డి, తోటకూరి శివయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రాంరెడ్డి జగన్నాథరెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు


