
వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
260 / 230
జిల్లాలో బుధవారం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు కురిసే వర్షం అవకాశముంది.
నిమజ్జన ఘాట్‌లో ఏర్పాట్లు పరిశీలన
ఖమ్మంక్రైం: ఖమ్మంలో కాల్వొడ్డు వద్ద మున్నేటిలో వినాయక నిమజ్జనానికి ఘాట్ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏర్పాట్లను మంగళవారం పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ పి.నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జనానికి ఇబ్బంది రాకుండా అడ్డుగా వైర్లు, చెట్లకొమ్మల తొలగింపు, క్రేన్లు, ప్లడ్‌లైట్లు, బారికేడ్ల ఏర్పాటు, రాకపోకలకు వేర్వేరు మార్గాల ఏర్పాటుపై చర్చించారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐలు మోహన్‌బాబు, సత్యనారాయణ, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అడిషినల్ కమిషనర్ అనిల్, డీఈఈ శ్రీనివాస్‌రావు, ఉత్సవ కమిటీ బాధ్యులు వినోద్ లాహోటి, విద్యాసాగర్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం
అందించాలి..
ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైద్యులు, సిబ్బంది లక్ష్యంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలోని పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేసిన ఆమె సౌకర్యాలను పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, ఖమ్మం 6వ డివిజన్‌లోని ఖానాపురంలో యూపీహెచ్‌సీ భవన నిర్మాణ పనులను డీఎంహెచ్‌ఓ పరిశీలించి సూచనలు చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ బిందుశ్రీ, డీపీఓ మేకల దుర్గ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమానికి ‘జన్ భగీధరి అభియాన్’
ఏన్కూరు: గిరిజన సంక్షేమానికి కేంద్రప్రభుత్వం జన్ భగీధరి అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఏన్కూరులో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశమైన ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగా హన కల్పించాలని సూచించారు. అనంతరం ఏన్కూరు కళాశాల హాస్టల్‌కు కేటాయించిన భవనాన్ని డీడీ పరిశీలించారు. ఎంపీడీఓ రంజిత్‌కుమార్, ఏఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్‌తో ప్రయోజనం
తల్లాడ: సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకుంటే ఏళ్ల తరబడి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. తల్లాడ, అన్నారుగూడెంలో మంగళవారం మోడల్ సోలార్ విలేజ్ స్కీంపై నిర్వహించిన సదస్సుల్లో డీపీఓ ఆశాలత, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, రెడ్‌కో జిల్లా మేనేజర్ అజయ్‌కుమార్ మాట్లాడారు. ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ ఇస్తుందని, మిగతా వ్యయంపై బ్యాంక్ రుణం తీసుకోవచ్చని తెలిపారు. ప్లాంట్ ద్వారా ఇంటికి కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూనే అదనపు విద్యుత్‌ను శాఖకు ఇవ్వొచ్చని చెప్పారు. ఎంపీడీఓ సురేష్, ఏడీఈ సతీష్, ఏఈ ప్రసాద్, ఆపతి వెంకటరామారావు పాల్గొన్నారు.