13న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

13న జాతీయ లోక్‌అదాలత్‌

Sep 4 2025 5:51 AM | Updated on Sep 4 2025 5:51 AM

13న జ

13న జాతీయ లోక్‌అదాలత్‌

ఖమ్మంలీగల్‌: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఈనెల 13న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జి.రాజగోపాల్‌ తెలిపారు. న్యాయవాదులు, చిట్‌ఫండ్‌, బ్యాంక్‌, బీమా కంపెనీల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌, వివాహ, కుటుంబ తగాదా తదితర కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. బీమా, బ్యాంక్‌, చిట్‌ఫండ్‌ అధికారులు పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ముందుకురావాలని సూచించారు. అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యంగా ముందస్తు లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి తెలిపారు.

ఖమ్మం మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

ఖమ్మంవ్యవసాయం: పండుగలు, వారాంతం కలిపి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల సెలవు ప్రకటించారు. ఈనెల 5న శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ, 6న శనివారం, 7న ఆదివారం వారాంతపు సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి మార్కెట్‌ కార్యకలాపాలు యథాతధంగా కొనసాగుతాయని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

విద్యుత్‌ ఫిర్యాదులకు వాట్సాప్‌ చాట్‌బాట్‌

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ సంబంధిత పిర్యాదులు, సేవల కోసం వాట్సాప్‌ చాట్‌బాట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. వినియోగదారులు తమ వాట్సాప్‌లో 79016 28348 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ చేస్తే ఎన్పీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌ నుంచి సందేశం వస్తుందని వెల్ల డించారు. ఆపై విద్యుత్‌ సమస్యలు, సేవా లోపాలపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. అంతేకాక ఎన్పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.tgnpdcl.comలో కూడా అందుబా టులో ఉన్న వాట్సాప్‌ యాప్‌ ఐకాన్‌తో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ 1912 ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశముందని ఎస్‌ఈ వెల్లడించారు.

7వరకు దరఖాస్తుకు

అవకాశం

ఖమ్మం సహకారనగర్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్‌ శ్రీజ, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ కూరపాటి మంగపతిరావు తెలిపారు. అలాగే, అపరాధ రుసుంతో 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వివరాలకు 80084 03522 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చేపల ఉత్పత్తిలో

రాణించాలి

కూసుమంచి: మత్స్యకారులు శిక్షణను సద్వి నియోగం చేసుకుంటూ చేపల ఉత్పత్తిలో రాణించాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయం డీన్‌ డి.రవీంద్రకుమార్‌రెడ్డి సూచించారు. పాలేరులోని పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో డీన్‌ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే చేపలకు ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుందని తెలి పారు. ఫిషరీస్‌ సీనియర్‌ సైంటిస్ట్‌(ఏపీ) ప్రభంజన్‌ కుమార్‌రెడ్డి, పాలేరు హెడ్‌ శ్యాంప్రసాద్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, శాంతన్న పాల్గొన్నారు.

ఐజీని కలిసిన సీపీ

ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశశీలించడానికి చండ్రుగొండకు వెళ్తున్న ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఖమ్మంలోని పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనను సీపీ సునీల్‌దత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీతోపాటు ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు పోలీసు సిబ్బంది ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి గౌరవవందనం సమర్పించారు.

13న జాతీయ  లోక్‌అదాలత్‌
1
1/1

13న జాతీయ లోక్‌అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement