
లక్ష్మీగణపతి!
రూ.51.60లక్షల కరెన్సీ మాలలతో అలంకరణ
గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా సత్తుపల్లిలోని శ్రీకోదండ రామాలయం ప్రాంగణంలో వాసవీగణపతిని బుధవారం కరెన్సీ మాలలతో అలంకరించారు. రూ.51.06 లక్షల విలువైన రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లతో గజమాలలు, మాలలు, కిరీటం, తోరణాలు చేసి అలంకరించగా స్వామి లక్ష్మీగణపతిగా దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వందనపు సత్యనారాయణతో పాటు సోమిశెట్టి శ్రీధర్, గంగిశెట్టి జగదీష్, ఉండు ఉమ, శివనాధ్‌ప్రభు, పోలిశెట్టి శివకుమార్, మంజుల పాల్గొన్నారు. – సత్తుపల్లిటౌన్