నాలుగు ఇసుక లారీలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఇసుక లారీలు సీజ్‌

Aug 22 2025 3:13 AM | Updated on Aug 22 2025 3:13 AM

నాలుగు ఇసుక లారీలు సీజ్‌

నాలుగు ఇసుక లారీలు సీజ్‌

సత్తుపల్లిటౌన్‌: అనుమతి లేకుండా ఇసుక తరలి స్తున్న నాలుగు లారీలను సత్తుపల్లి రవాణాశాఖ అధికారి గురువారం సీజ్‌ చేశారు. సత్తుపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కొవ్వూరు నుంచి సత్తుపల్లికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు నాలుగు లారీలను సీజ్‌ చేసినట్లు రవాణాశాఖ అధికారి జే.ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.

పశువుల పరిహారం స్వాహాపై విచారణ

తిరుమలాయపాలెం: మండలంలోని రాకాసితండాలో గత ఏడాది వచ్చిన వరదలతో పశువులు, మేకలు, కోళ్లు మృతి చెందగా, ప్రభుత్వ మంజూరు చేసిన పరిహారం పక్కదారి పట్టిందనే ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గురువారం జిల్లా వెటర్నరీ కార్యాలయ ఉద్యోగులు రాకాసి తండాలో విచారణ చేపట్టారు. ఇప్పటికే డీఆర్‌ఓ పద్మశ్రీ, ఉద్యోగులు శర్మ, బోడెపూడి శ్రీనివాసరావు, స్వర్ణలత విచారణ జరిపిన విషయం విదితమే. అయితే, చనిపోయిన జీవాలు, బాధితులకు అందిన పరిహారంపై పొంతన లేకపోవడంతో ఇంటింటి సర్వేకు నిర్ణయించారు. ఇందులో భాగంగా వెటర్నరీ కార్యాలయ ఏడీ శ్రీ రమణి, జీఓఎం స్వర్ణలత తదితరులు పరిహారం పొందిన వారికి ప్రస్తుతం ఉన్న పశువులు, మేకల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం తిరుమలాయపాలెం తహసీల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో

పోస్టుమ్యాన్‌ మృతి

టేకులపల్లి: టేకులపల్లి మండలం మాలపల్లికి చెందిన పోస్ట్‌మ్యాన్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాలపల్లికి చెందిన గుమ్మడి జానకీరామ్‌(58) ప్రెగళ్లపాడులో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జానకీరామ్‌ను హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందాడు.

ప్రేమబంధం.. ఏడాదిలో విషాదం

ఇల్లెందురూరల్‌: పెద్దలు అంగీకరించకున్నా ప్రేమ వివాహం చేసుకున్న వారి కాపురం ఏడాది పాటు సాఫీగా సాగింది. వారంలోగా పండంటి బిడ్డ జన్మించనుందనే ఆనందంలో ఉండగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. మండలంలో మామిడిగుండాలకు చెందిన సూర్నపాక వెంకన్న(25), గార్ల మండలం గుంపెళ్లగూడేనికి చెందిన శ్రీజ ప్రేమవివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీజ తొమ్మిదో నెల గర్భిణి కాగా, ప్రసవం తేదీ సమీపించడంతో గురువారం ఆస్పత్రికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శ్రీజ ఆధార్‌కార్డు గుంపెళ్లగూడెంలో ఉండడంతో తీసుకురావాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు భర్త వెంకన్న ముందుగానే బైక్‌పై వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయాన ఆటోలో అక్కడకు వచ్చిన శ్రీజ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. శ్రీజ పురిటినొప్పులతో ఆస్పత్రిలోనే ఉండగానే.. ఆమెకు చివరి చూపు దక్కకకుండానే వెంకన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రమాదంలో భర్త మృతి,

పురిటినొప్పులతో ఆస్పత్రిలో భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement