
ఉన్నత ప్రమాణాలతో క్రికెట్ పిచ్‌లు
ఖమ్మంస్పోర్ట్స్: కూసుమంచి మండలం జీళ్లచెర్వు పరిధిలోని ఆగ్రహారంలో ఖమ్మం జిల్లా క్రికెట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో రెండు క్రికెట్ పిచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంఘం కార్య ద ర్శి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ఎండీ మసూద్‌పాషా తెలిపారు. ఆదివారం నగరంలోని సీక్వెల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీళ్లచెర్వులో 14 ఏకరాల స్థలంలో క్రికెట్ మైదానంతోపాటు బీసీసీఐ ప్రమాణాలతో రెండు క్రికెట్ పిచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఒక్క పిచ్‌ను జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఆడే విధంగా సిద్ధం చేస్తున్నామని, మరో పిచ్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు తీర్చిదిద్దుతున్నామన్నారు. పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు నడుంబిగించామని తెలిపారు. నిధులు దుర్వినియోగం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, క్రికెట్ అభివృద్ధికి తనవంతు సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఎస్.కె.గయాజ్‌పాషా, బి.సందీప్, ఫారుఖ్, యాకూబ్, అసిఫ్, మల్సూర్, క్రికెటర్ల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
జీళ్లచెర్వులో త్వరలో అందుబాటులోకి..