
సురవరం.. ఓ విప్లవోద్యమ కెరటం..
ఖమ్మంమయూరిసెంటర్: ఓ తరం విప్లవోద్యమ కెరటం సురవరం సుధాకర్‌రెడ్డి అని, ఆయన మరణంతో మార్క్సిస్ట్ మేధావిని కోల్పోయామని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు.
విద్యార్థి దశ నుంచే సురవరంతో కలిసి పనిచేశానని, ఆ తర్వాత ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను సుధాకర్‌రెడ్డి స్వీకరించారని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు కలిసి పనిచేశామని తన జీవితాన్ని పోరాట చరిత్రగా మార్చుకున్న ఘనుడు ఆయన అని కొనియాడారు.
సుధాకర్ రెడ్డికి నివాళులు..
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నివాళులర్పించారు. వారితో పాటు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, పీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం తదితరులు ఉన్నారు.