
కాంగ్రెస్ గెలుపులో బీసీలదే కీలక పాత్ర
సత్తుపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు కీలక భూమిక పోషించారని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మోసం చేసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. ఆదివారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్‌తో కలిసి వీరబాబు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటాన్ని బీసీ సమాజం మరిచిపోదన్నారు. అనంతరం వీరబాబును బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మల్లెలి శ్రీనివాస్, మరీదు ప్రసాద్, వీరివాడ నాగభూషణం, సుధాకర్, వెంకటేశ్వర్లు, రంగారావు, నాంచారి, గౌతమ్ పాల్గొన్నారు.