
ప్రజావాణి దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. చేయగలిగిన పని వెంటనే పూర్తి చేయడంతో పాటు సాధ్యం కాకపోతే అందుకు కారణాలతో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కాగా, రేషన్ డీలర్ల సంక్షేమ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకన్న, జానీమియా కమీషన్ చెల్లింపుపై ప్రజావాణితో పాటు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అలాగే, ప్రజావాణికి పలువురు దివ్యాంగులు, వృద్ధులు రావడంతో గమనించిన కలెక్టర్ అనుదీప్ వారిని పక్కన కూర్చోబెట్టి అక్కడకే వెళ్లి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు.