ఒక క్లిక్‌ చేస్తే చాలు..! | - | Sakshi
Sakshi News home page

ఒక క్లిక్‌ చేస్తే చాలు..!

Aug 26 2025 7:52 AM | Updated on Aug 26 2025 8:00 AM

● వెబ్‌సైట్‌తో కేఎంసీకి ఆదాయం.. సులభంగా పౌరసేవలు ● ఆఫీస్‌కు వెళ్లే పనిలేకుండా అరచేతిలో సమాచారం ● పైలట్‌ ప్రాజెక్టుగా 44వ డివిజన్‌లో అమలు సేవలు సులభతరం..

అన్ని

వివరాలతో...

పన్నుల వివరాలతో రెవెన్యూ డాష్‌ బోర్డు
● వెబ్‌సైట్‌తో కేఎంసీకి ఆదాయం.. సులభంగా పౌరసేవలు ● ఆఫీస్‌కు వెళ్లే పనిలేకుండా అరచేతిలో సమాచారం ● పైలట్‌ ప్రాజెక్టుగా 44వ డివిజన్‌లో అమలు

అరచేతిలో సమాచారం

కేఎంసీ పరిధి 60 డివిజన్లలో 82,076 అసెస్‌మెంట్లు(భవనాలు)ఉన్నాయి. ఇందులో వాణిజ్య, గృహావసరాలు కలిసినవి 3,730, వాణిజ్య పరమైనవి 3,795, గృహావసరాలవి 74,551 ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఏటా పన్నుల రూపంలో రూ.31.64 కోట్లు ఆదాయం వస్తోంది. ఈనేపథ్యాన ప్రతీ అసెస్‌మెంట్‌ పూర్తి సమాచారంతో గూగుల్‌ఎర్త్‌ మ్యాప్‌ అనుసంధానంగా డాష్‌ బోర్డు రూపొందించారు. డాష్‌బోర్డు మ్యాప్‌లో కనిపించే ప్రతీ ఇంటికి ఒక పాయింట్‌ పెట్టారు. దీనిపై క్లిక్‌ చేస్తే ఇంటి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. అసెస్‌మెంట్‌ నంబర్‌, ఇంటి నంబర్‌, ఎన్ని అంతస్తులు, ఎంత పన్ను చెల్లించాలి, పాత బకాయి ఎంతనే వివరాలు తెలుసుకోవచ్చు.

పైలట్‌గా 44వ డివిజన్‌

కొత్త వెబ్‌సైట్‌కు సంబంధించి ప్రయోగాత్మకంగా 44వ డివిజన్‌ను ఎంపిక చేశారు. ఈ డివిజన్‌లోని 907 అసెస్‌మెంట్ల వివరాలు పొందుపరిచారు. తద్వారా రూ.59,66,811 పన్ను పెండింగ్‌ ఉండగా, రూ.38,74,610 చెల్లించినట్లు డాష్‌బోర్డులో చూపిస్తోంది. అంతేకాక ప్రతీ ఇంటికి పాయింట్‌ కేటాయించి పన్నుల వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్న ఈ డాష్‌బోర్డు మ్యాప్‌లో ఇంటిపై మార్క్‌ను క్లిక్‌ చేస్తే సమస్త సమాచారం అందుబాటులోకి రానుంది.

ఆదాయాన్ని రెట్టింపు చేసేలా..

గూగుల్‌ ఎర్త్‌మ్యాప్‌ డాష్‌బోర్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక 60 డివిజన్లకు సంబంధించి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ముందుగా డివిజన్ల పరిధిలో అసెస్‌మెంట్ల సర్వే చేపట్టి పన్నుల లక్ష్యాన్ని తేలుస్తారు. తద్వారా ప్రస్తుతం ఆస్తి పన్ను ద్వారా వస్తున్న ఆదాయం భారీగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. డాష్‌బోర్డు వినియోగించడంతో పన్నుల వసూళ్లు, చెల్లింపుల్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటి యజమాని సైతం ఎప్పటికప్పుడు బకాయిల వివరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.

అసెస్‌మెంట్‌ వివరాలు తెలుసుకునేందుకు గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌ అనుసంధానంతో రియల్‌టైమ్‌ రెవెన్యూ డాష్‌బోర్డు సిద్ధమవుతోంది. దీంతో ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి వచ్చే అవసరముండదు. అంతేకాక యజమాని వివరాలను సులువుగా తెలుస్తాయి. అధికారులకు సైతం పన్నుల బకాయిలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 44వ డివిజన్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నాం.

– అభిషేక్‌ అగస్త్య, కమిషనర్‌,

ఖమ్మం మున్పికల్‌ కార్పొరేషన్‌

ఇంటి పన్నుల చెల్లింపులు, బకాయిల వివరాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం సీడీఎంఏ వెబ్‌సైట్‌ డాష్‌ బోర్డు ఉన్నా ఇటు పౌరులు, అటు అధికారులు పూర్తి సమాచారం పొందలేకపోతున్నారు. బకాయిలు, అసెస్‌మెంట్‌ కచ్చితమైన స్థానం, వారి పరిధిలోని బిల్‌ కలెక్టర్‌ వివరాలు కూడా సమగ్రంగా లేవు. దీంతో ప్రత్యేక రియల్‌ టైమ్‌ రెవెన్యూ డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ అభిషేక్‌ నిర్ణయించారు. ఈమేరకు కేఎంసీకి www.khammammc.com వెబ్‌సైట్‌ రూపొందించడంతోపాటు డాష్‌ బోర్డు ఏర్పాటు చేశారు.

ఒక క్లిక్‌ చేస్తే చాలు..!1
1/1

ఒక క్లిక్‌ చేస్తే చాలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement