
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మండలంలోని గంగబండతండా ఫ్‌లై ఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు... కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం చెన్నంశెట్టిపల్లికి చెందిన బోయ తిరుమలేష్(22) బొలేరో వాహనంలో మంగళవారం రాత్రి మిర్చి లోడు తీసుకుని ఖమ్మం వస్తున్నాడు. ఈక్రమాన ఫ్‌లై ఓవర్‌పై రహదారి మరమ్మతుల కారణంగా ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో వాహనం నడుపుతున్న తిరుమలేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
మధిర: మధిర సమీపాన వైరా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. మడుపల్లికి చెందిన పెసరమల్లి వినోద్(28) చేపలు పట్టేందుకు మంగళవారం వైరా నదికి వెళ్లి గల్లంతయ్యా డు. ఈమేరకు బుధవారం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఆధ్వర్యాన గాలించగా ఆయ న మృతదేహం లభించింది. ఘటనపై వినోద్ కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు.
తల్లిదండ్రులు
మందలించారని ఆత్మహత్య
ఖమ్మంరూరల్: నిత్యం సెల్‌ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్న యువకుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లికి చెందిన ధనుష్ ఐటీఐ చదువుతున్నాడు. ఆయన నిత్యం నిత్యం సెల్‌ఫోన్ చూస్తూ కాలం గడుపుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈనెల14న ఇంటి నుండి వెళ్లిపోయిన ధనుష్ ఖమ్మం రూరల్ మండలం పెదతండాకు చేరుకున్నాడు. అక్కడ ఎలుకల మందు తాగి అపస్మారక స్థితికి చేరగా తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ధనుష్ తండ్రి ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు.
ఒంటరితనం భరించలేక..
పాల్వంచ: ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం శ్రీనివాసనగర్‌కు చెందిన సుగ్గాల వెంకటసాయిరామ్ (36) శాసీ్త్రరోడ్‌లోని పద్మజ ఫ్యాన్సీలో వర్కర్‌గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గట్టాయిగూడెంలో అద్దెకు ఉంటున్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి అనారోగ్యంతో మూడేళ్ల కిందట చనిపోయాడు. ఒంటరితనంతో మానసికంగా కృంగిపోయాడు. గత 15వ తేదీన ఆరోగ్యం బాగోలేదని దుకాణానికి రానని చెప్పాడు. బుధవారం తాను ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు తీసి చూడగా, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఒంటరితనం భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని బంధువు మహిపతి లవరావు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిల్లుల్లో అధికారుల తనిఖీ
ఖమ్మం సహకారనగర్: వానాకాలానికి సంబంధించి లక్ష్యం మేర సీఎంఆర్‌ను మిల్లర్లు సకాలంలో ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సభ్యుడు అంజయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ సూచించారు. జిల్లాలోని ముదిగొండ, తదితర మండలాల్లో మిల్లులను బుధవారం వారు తనిఖీ చేసి మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్లు నాగలక్ష్మీ, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.