
విగ్రహాల తరలింపునకు అనుగుణంగా లైన్ల మార్పిడి
ఖమ్మంవ్యవసాయం: వినాయక ఉత్సవాల నేపథ్యాన విగ్రహాల తరలింపు సమయాన ఆటంకాలు ఎదురుకాకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో పలుచోట్ల కిందకు ఉన్న లైన్లను మంగళవారం సరిచేశారు. ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పర్యవేక్షణలో బ్రాహ్మణబజార్, ఖిలారోడ్డు తదితర ప్రాంతాల్లో లైన్లను సరిచేయడంతో పాటు గణపతి మండపాల నిర్వాహకులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
●ముదిగొండ: ముదిగొండ మండలం వెంకటాపురం ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇళ్ల పైనుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్లను మార్చేలా స్తంభాలు వేయడానికి విద్యుత్‌శాఖ అధికారులు మంగళవారం మార్కింగ్ చేశారు. ఈ విషయమై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నాగేశ్వరరావు, నేషనల్ హైవే డీఈ హరికృష్ట ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్ వారితో చర్చించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏఈలు మేకపోతుల శ్రీనివాస్, గోపి, చైతన్య, ఆర్‌ఐ కల్యాణి పాల్గొన్నారు.
‘మోదీ పాలన దేశానికి
ప్రమాదకరం’
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వాన కొనసాగుతున్న పాలన దేశానికి ప్రమాదంగా మారిందని, ఆయన ప్రపంచ పటంలో దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడమే కాక కార్మిక చట్టాల సవరణ ద్వారా వారి హక్కులను కాలరాశారని ఆరోపించారు. కాగా, దేశవ్యాప్త కులగణనను కేంద్రప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే, కులగణన, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తుండడం గర్హనీయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, నాయకులు దొంగల తిరుపతిరావు, శ్రీనివాసరావు, ఎంఏ.జబ్బర్, ఎస్‌కే.మీరా సాహిబ్, ఎన్.నవీన్‌రెడ్డి, బోడపట్ల సుదర్శన్, ఎస్‌కే.నాగుల్‌మీరా, పి.నాగసులోచన పాల్గొన్నారు. కాగా, వైరాలో జరిగిన సీపీఎం డివిజన్ కమిటీ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల ఇక్కట్లకు కేంద్రప్రభుత్వమే కారణమని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా అందే వరకు కార్యకర్తలు ఉద్యమించడమే కాక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, దుగ్గి కృష్ణ, దొంతబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విగ్రహాల తరలింపునకు అనుగుణంగా లైన్ల మార్పిడి