
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ఏన్కూరు: వర్షాల నేపథ్యాన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. ఏన్కూరు పీహెచ్‌సీ, ఆరోగ్య ఉపకేంద్రంతో పాటు హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, ఎంపీడీఓ, జీపీ కార్యాలయాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అలాగే, మండల కేంద్రంలోని పలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, జ్వరాల కేసులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి సూచనలు చేశారు. ఎంపీడీఓ జీవీఎస్.నారాయణ, వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామపంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు.