
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
ఖమ్మం అర్బన్: మహిళలు లాభసాటి వ్యాపారాలపై దృష్టి సారించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించిన ఆయన ఉపాధి శిక్షణ తరగతుల వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అందిస్తున్న డ్రోన్ పైలెట్ శిక్షణను పరిశీలించాక మాట్లాడారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు శిక్షణ తీసుకుంటుండడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం పెరుగుతున్నందున శిక్షణ పొందిన మహిళలకు మంచి ఉపాధి లభిస్తుందని తెలిపారు. డ్రోన్ ఆపరేటర్‌గా రోజుకు రూ.15 వేల మేర సంపాదించే అవకాశముందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, ఉద్యోగులు సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్ కుమార్, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య, జయ, శారద, అనిత, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి