
విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలి
ఖమ్మం రాపర్తినగర్: విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకునేలా ఎన్‌ఎస్‌ఎస్ ఉపకరిస్తుందని కాకతీయ యూ నివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. ఖమ్మం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, నవ సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, 2 ప్రోగ్రామ్ అధికారులుగా పి.చంద్రకళ, జి.వెంకటేశ్వర్లును నియమించారు. కళాశాల ప్రిన్సి పాల్ డి.రాజ్యలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.