
మాజీ సైనికులకు సైతం ప్రభుత్వ పథకాలు
ఖమ్మంలీగల్: మాజీ సైనికులకు అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పి.శ్యామ్‌కోషి తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్‌లో మంగళవారం ఆయన ప్రారంభించగా, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి కె.ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ క్లినిక్‌ను మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ సైనికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సప్రందించాలని సూచించారు. ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఉమాదేవి మాట్లాడగా క్లినిక్‌లో న్యాయవాదిగా జి.అమర్‌నాథ్, పారాలీగల్ వలంటీర్‌గా మహబూబ్ సుబానీని నియమించారు. న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి కల్పన, డిఫెన్స్ కౌన్సిల్ బి.శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.
హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఐటీడీఏ ఆధ్వర్యాన పీఓ బి.రాహుల్ తెలిపారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీ నంబర్ కలిగిన నిరుద్యోగ యువత జిరాక్స్ సర్టిఫికెట్లతో ఐటీడీఏలోని భవిత విభాగంలో సెప్టెంబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్‌లో ఇచ్చే శిక్షణ సమయాన ఉచిత వసతి ఉంటుందని తెలిపారు. వివరాలకు 63026 08905, 90638 89994 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.
టీఎల్‌ఎంతో
అర్థమయ్యేలా బోధన
ఖమ్మంరూరల్: బోధన అభ్యసన సామగ్రి(టీఎల్‌ఎం) వినియోగంతో బోధన సులువు కావడంతో పాటు విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటారని గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని గొల్లగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన టీఎల్‌ఎం మేళానుమంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలకు కేరాఫ్‌గా మార్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉద్దీపకం వర్క్ బుక్–1పై పరీక్షలో నానూనగర్ తండా, గోవింద్రాల పాఠశాల విద్యార్థులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారని తెలిపారు. ఏటీడీఓ సత్యవతి, హెచ్‌ఎం ఆర్.శ్యామ్, ఉద్యోగులు భారతి, బాలా, ప్రసాద్, వెంకటరమణ పాల్గొన్నారు.
ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ
బోనకల్: బోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన తాళ్లూరి నయనశ్రీ ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఈనెల 20నుంచి 23 వరకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరిగిన పోటీల్లో 500, 1,500 మీటర్ల విభాగంలో కాంస్య పతకాలు, 1000 మీటర్ల విభాగం, మహిళల రిలే విభాగంలో రజత పతకాలు సాధించింది. గత జూన్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన నయనశ్రీ, ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు గెలుచుకోవడం విశేషం. ఈ ఏడాది నవంబర్‌లో కజకిస్తాన్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన ఆమె ప్రస్తుతం బెంగుళూరులో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆరో ఏట నుంచే స్కేటింగ్‌లో రాణిస్తున్న నయనశ్రీని పలువురు అభినందించారు.

మాజీ సైనికులకు సైతం ప్రభుత్వ పథకాలు

మాజీ సైనికులకు సైతం ప్రభుత్వ పథకాలు