
మార్కెట్ యార్డుల అభివృద్ధిపై దృష్టి
మధిర/ఎర్రుపాలెం: మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరంతరం కార్యకలాపాల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై మంగళవారం చర్చించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ పాల్గొనగా చైర్మన్ బండారు నర్సింహారావు, కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు, వ్యాపారులు హాజరయ్యారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని నిరంతరం కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని జేడీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాస్ ఎర్రుపాలెంలోని గోదాంలను పరిశీలించి, అక్కడ చేయాల్సిన అభివృద్ధిపై పనులపై చర్చించారు. అలాగే, రాజుపాలెం వద్ద చెక్‌పోస్టును కూడా పరిశీలించారు. మార్కెట్ డైరెక్టర్లు గుడేటి బాబురావు, వేమిరెడ్డి అనురాధ, యన్నం పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మధిర మార్కెట్‌లో నిరంతరం కొనుగోళ్లు