
జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన ఏ.గౌతమ్, ఎస్.గోపీచంద్, ఎ.మైథిలి ఎంపికయ్యారు. ఇటీవల హనుమకొండలో జరిగి న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. దీంతో తమిళనాడు రాష్ట్రం చైన్నెలో ఈనెల 20నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ అభినందించారు.
వైద్య, ఆరోగ్యశాఖ చట్టాలపై నేడు సదస్సు
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య,ఆరోగ్యశాఖ చట్టా లపై అవగాహన కల్పించేందుకు బుధవారం సదస్సు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ బి.కళా వతిబాయి తెలిపారు. చట్టాలు, వీటిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలపై వివరించే ఈ సదస్సు కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందని వెల్లడించారు. కలెక్టరేట్‌లో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే సదస్సుకు ప్రై వేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, స్కానింగ్, డయాగ్నస్టిక్, ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేట్ రేడియోలజిస్టులు, గైనకాలజిస్టులు హాజరుకావాలని సూచించారు.
ఆలయ షాప్‌ల వేలంతో రూ.98లక్షల ఆదాయం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పలు దుకాణాల అప్పగింతకు మంగళవారం అధికారులు వేలం నిర్వహించారు. ఏడాది కాలానికి తలనీలాలు, కొబ్బరి చిప్పల సేకరణ, పొంగళ్లకు గ్యాస్ స్టౌల సరఫరా, వా హనాల పార్కింగ్, కొబ్బరికాయలు, బొమ్మల దుకాణాల నిర్వహణకు వేలం వేయగా రూ. 98.79లక్షల ఆదాయం సమకూరిందని ఈఓ కె.జగన్మోహన్‌రావు తెలిపారు. గత ఏడాది కంటే ఇది రూ.21.94లక్షలు అదనమని వెల్లడించారు. ఆలయ సూపరింటెండెంట్ విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
నర్సరీల్లో నాణ్యమైన మొక్కలే పెంచాలి
కూసుమంచి: నర్సరీల నిర్వాహకులు నాణ్య మైన మొక్కలే పెంచి రైతులకు అందించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి మధుసూధన్ సూచించారు. కూసుమంచి, కేశ్వాపురం, గోపాలరావుపేటల్లో నర్సరీలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన మొక్కల నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. నర్సరీల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి రైతులు నష్టపోవడానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలేరు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు.

జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎంపిక

జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎంపిక

జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎంపిక