
వెబినార్‌లో తిరుమలాయపాలెం విద్యార్థిని
తిరుమలాయపాలెం: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వెబినార్‌లో తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.భవ్యశ్రీ పాల్గొంది. తెలంగాణలో 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. భవ్యశ్రీ రానున్న వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపన ఆవశ్యకతను వివరించింది. ప్రత్యక్షంగా మట్టి విగ్రహాలను తయారుచేస్తూ మాట్లాడిన ఆమెను జ్యూరీ సభ్యులు అభినందించారు. కాగా, రాష్ట్రస్థాయి వెబినార్‌లో ఉపాధ్యాయులు పెసర ప్రభాకర్‌రెడ్డి, తెప్పల్లి శ్యామ్‌కుమార్ సహకారంతో పాల్గొన్న భవ్యశ్రీని ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్‌ఎం విజయకుమారి అభినందించారు.
మట్టి గణపతి ప్రాముఖ్యతను వివరించిన భవ్యశ్రీ