
గడువులోగా సీఎంఆర్ డెలివరీ
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పంపిణీ పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్షించా రు. 2024–25కు సంబంధించి సీఎంఆర్ డెలి వరీ గడువును ప్రభుత్వం నెల పాటు పొడిగించినందున, సెప్టెంబర్ 12వరకు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అలాగే, ఖరీఫ్ సీజన్‌లో ఇవ్వాల్సిన 1.98 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌లో 1.69 మెట్రిక్ టన్నులు ఇచ్చినందున మిగతా కూడా త్వరగా సరఫరా చేయాలని సూచించారు. డీసీ ఎస్‌ఓ చందన్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
పంటల కనీస
మద్దతు ధర పెంపు
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం 2025– 26 సంవత్సరానికి పంటల కనీస మద్దతు ధర పెంచిందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరల వివరాలను ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. వరి కామన్ రకం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389, జొన్నలు హైబ్రిడ్ రూ.3,699, సజ్జలు రూ.2,775, మొక్కజొన్నలు రూ.2,400, కందులు రూ.8వేల, పెసలు రూ.8,768, మినుములు రూ.7,800, వేరుశనగ రూ.7,263, నువ్వులు రూ.9,846, పత్తి రూ. 8,110గా ధరలు నిర్ణయించారని తెలిపారు. ఈమేరకు రైతులు పంట ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తూ కనీస మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ సూచించారు.
‘నవోదయ’లో ముగిసిన కళా ఉత్సవ్
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని వెలికితీసేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఎంఈఓ బీ.వీ. రామాచారి మాట్లాడగా విద్యాలయ ప్రిన్సిపా ల్ కె.శ్రీనివాసులు, వివిధ జిల్లాల నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దుమ్ము, ధూళి
నియంత్రణపై పర్యవేక్షణ
సత్తుపల్లిరూరల్: బొగ్గు రవాణా సమయంలో దుమ్ము, ధూళి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బొగ్గు నిల్వచేసే సైలోబంకర్, లోడింగ్ విధానా న్ని పరిశీలించి మాట్లాడారు. ధూళి నియంత్రణ కు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అమలుచేయాలని తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ, ఓసీ పీఓ ప్రహ్లాద్, సీహెచ్‌పీ ఇన్‌చార్జ్ డీజీఎం సోమశేఖర్‌రావు, ఇంజనీర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సత్తుపల్లిలో సోమ, మంగళవారం కురిసిన వర్షం కారణంగా జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు ఓసీల్లో 30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 92వేల మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.

గడువులోగా సీఎంఆర్ డెలివరీ