
గుంతను తప్పించబోయి కారు బోల్తా
కొణిజర్ల: రహదారిపై గుంతను తప్పించే కారు బోల్తా పడిన ఘట న కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన శుక్రవారం ఉద యం జరిగింది. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఇద్దరు కారులో వెళ్తుండగా తీగలబంజర సమీ పాన రోడ్డుపై భారీ గుంతను తప్పించే క్రమంలో పక్కకు తిప్పగా అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడగా, జేసీబీ సాయంతో స్థానికులు కారును బయటకు తీశారు.
అడవి పంది మాంసం స్వాధీనం
సత్తుపల్లిరూరల్: అడవి పందిని వేటాడి మాంసం పంచుకుంటుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని యాతాలకుంట గ్రామానికి చెందిన నాగరాజు, నాగార్జున, రామకృష్ణ చేనులో అడవి పందిని కుక్కలు వేటాడడంతో చనిపోయింది. సుమారు ఎనిమిది నెలల వయస్సు ఉన్న అడవి పందిని శుక్రవారం ఇంటికి తీసుకొచ్చిన వారు పోగులు వేస్తున్నారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, బీట్ ఆఫీసర్ కిరణ్ తనిఖీలు చేపట్టి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు.