
బంగారు భవిష్యత్..
సీతారామ ఎత్తిపోతలతో 3.28లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
మహిళా సంఘాలకు
సోలార్ విద్యుత్ ప్లాంట్లు
జిల్లాలో నూతనంగా
24,818 కుటుంబాలకు రేషన్‌కార్డులు
14,500 ఎకరాల్లో
కొత్తగా ఆయిల్‌పామ్ సాగు
స్వాతంత్య్ర వేడుకల్లో
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
సోలార్ విద్యుత్ ఉత్పత్తి
ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఎర్రుపాలెం మండలం రాజులపాలెం, కల్లూరు మండలంలోని చిన్నకోరుకోండిలో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా సౌరగిరి జలవికాసం ద్వారా జిల్లాలో 550మందికి సోలార్ పంపు సెట్లు సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా రానున్న మూడేళ్లలో జిల్లాలోని 11,785 మంది రైతులకు చెందిన 27,447 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. మోడల్ సోలార్ విలేజ్ స్కీంకు బోనకల్ మండలంలోని 22 గ్రామాలను ఎంపిక చేశాం. అలాగే, మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ స్టాళ్లు ఏర్పాటు చేయించాం. ఇసుక రీచ్‌ల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా 80 శాతం సబ్సిడీతో 40 వేల గేదెలు పంపిణీ చేస్తాం.
ఏడాదిలోగా జవహర్ ఎత్తిపోతలు
మధిర, ఎర్రుపాలెం మండలాల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించేలా రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి 33 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరి స్తాం. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 3,28,853 ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తాం. రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయితే 455 ఎకరాల కొత్త ఆయకట్టు, 1,957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
ఆధునిక వైద్యం
జిల్లా ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో గత ఏడాది 15,040 శస్త్ర చికిత్సలు, 6,658 ప్రసవాలు జరిగాయి. పాలేరు, సత్తుపల్లిలో రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, వైరాలో రూ.37.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, జిల్లా ఆస్పపత్రిలో రూ. 23.50 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాలల సదనంలోని 81 మంది పిల్లలకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆధార్ కార్డులు అందాయి.
పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ
వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద రహదారిని అభివృద్ధి చేశాం. జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖమ్మం ఖిలా రోప్‌వే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. పాలేరు వద్ద పర్యాటకాభివృద్ధికి రూ.16.75 కోట్లకు గాను రూ.5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధస్తూపాల అభివృద్ధి, వసతుల కల్పనకు రూ.5.82 కోట్లలో రూ.2.50కోట్లు, మధిర పెద్ద చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లకు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు, కనకగిరి గుట్టలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నాం.
నృత్యం చేస్తున్న చిన్నారి

బంగారు భవిష్యత్..