అదే మా లక్ష్యం, పాలనావిధానం
● రాజీవ్ కెనాల్‌తో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ● మధిరలో ఇందిరా మహిళా డెయిరీతో మహిళల ఆర్థికాభివృద్ధి ● తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
జాతీయజెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పక్కన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీసీ సునీల్‌దత్ (ఇన్‌సెట్)
ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి
పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతుండగా, అభివృద్ధి, సంక్షేమాలను ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. స్వరాష్ట్ర సాధన
ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేకమంది అసువులు బాయగా.. వీరి త్యాగాలతోనే ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే... – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
పెరగనున్న ఆయకట్టు సేద్యం
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.100 కోట్లతో నిర్మించిన రాజీవ్ కెనాల్‌ను వినియోగించి రూ.1.25 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి– యాతాలకుంట ట్రంక్‌కెనాల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగు నీరు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశాం. మున్నేరు నుంచి పాలేరు కెనాల్ వరకు రూ.102.92 కోట్ల అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. మున్నేటి వరద ముంపునకు అడ్డుకట్ట వేసేలా ఇరువైపులా రూ.525.36 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నాం.
మహిళల ఆర్థిక సాధికారత
● మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుచేస్తున్నాం. 21వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండేసి పాడి గేదెలు ఇచ్చి పాలు సేకరిస్తాం. అలాగే, ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ షాపుపెద్దమొత్తంలో నిధులతో 613 క్యాంటీన్ షెడ్లు, 28 పౌల్ట్రీ షెడ్లు ఏర్పాటు చేశాం.
● భూభారతితో రైతుల సమస్యలు తీరనున్నాయి. జిల్లాలోని నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సదస్సుల ద్వారా 3,224 దరఖాస్తులు స్వీకరించాం. ఆపై బోనకల్ మండలాన్ని రెండో పైలట్ మండలంగా ఎంపిక చేసి సదస్సులు నిర్వహించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి.
● 2024–25 యాసంగి సీజన్‌లో జిల్లాలో ఇప్పటి వరకు 32,102 మంది రైతుల నుంచి 21,66,180 క్వింటాళ్ల ధాన్యం సేకరించాం. ఇందులో సన్న ధాన్యానికి బోనస్‌గా 47,494 మంది రైతులకు రూ.136.33 కోట్లు చెల్లించాం.
● తాగునీటి సమస్య పరిష్కారానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.229 కోట్లతో చేపట్టిన పనులు తుదిదశలో ఉన్నాయి. వైరాలో రూ.28 కోట్లు, మధిరలో రూ.17 కోట్ల నిధులతో పనులు పూర్తిచేశాం.
● జిల్లాలోని 60 పాఠశాలల్లో న్యూట్రిగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. మధిరలో రూ.4కోట్లు, సిరిపురంలో రూ.5 కోట్లు, కూసుమంచి మండలంలో రూ.5.50 కోట్లతో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు చేపట్టాం. ఖమ్మం మెడికల్ కాలేజీకి నూతన భవనాల నిర్మాణం రూ.130 కోట్లతో చేపడుతున్నాం. అలాగే, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 – 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం.
● పర్యాటక అభివృద్ధికి నూతన పాలసీ తీసుకొచ్చాం. వెలుగుమట్ల అర్బన్‌పార్క్ వద్ద 40 అడుగుల రోడ్డు, ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అభివృద్ధి చేశాం. ఖమ్మం ఖిలాపైకి రోప్‌వే నిర్మాణానికి రూ.29 కోట్లతో ప్రతిపాదించాం. పాలేరు రిజర్వాయర్ అభివృద్ధి, పర్యాటకులకు సౌకర్యాల కల్పన కోసం రూ.16.75 కోట్లతో ప్రతిపాదించి రూ.5కోట్లు మంజూరు చేశాం.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్‌ఓ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పెనుబల్లి మండలం పులిగుండాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సఫారీ వాహనాన్ని పరేడ్ గ్రౌండ్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు.
అదే మా లక్ష్యం, పాలనావిధానం
అదే మా లక్ష్యం, పాలనావిధానం


