●ఆసియా ఖండంలోనే ఖ్యాతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని సీఎస్‌ఐ చర్చి నిలుస్తోంది. ఆంగ్లేయుల కాలంలో ఈ చర్చి తొలుత డంగు సున్నంతో నిర్మించారు. రానురాను భక్తుల సంఖ్య పెరగడంతో 2000 సంవత్సరంలో నూతన చర్చిని నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారు. కొత్త భవనాన్ని 2005 మే 1వ తేదీన మెదక్ చర్చి దివంగత ఫాదర్ బీపీ సుగంధన్ ప్రారంభించారు. ప్రతీ ఆదివారం ఐదు వేల మందికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలకు హాజరవుతారు. ఫాస్టరేట్ చైర్మన్‌గా డీమాల అభిజిత్ వ్యవహరిస్తున్న ఈ చర్చి డోర్నకల్ అధ్యక్ష మండలి పరిధిలో కొనసాగుతోంది.
●ఆసియా ఖండంలోనే ఖ్యాతి


