●125 ఏళ్ల సీఎస్‌ఐ చర్చి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని సీఎస్‌ఐ(చర్చి ఆఫ్ సౌతిండియా) చర్చికి ఘన చరిత్ర ఉంది. డోర్నకల్ డయోసిస్ పరిధిలో ఖమ్మం, కొత్తగూడెంలో రెండు పెద్ద చర్చిలు ఉండగా, మరో 167 చర్చిల నిర్వహణ కొనసాగుతోంది. ఇందులో ఖమ్మం చర్చి నిర్మాణానికి 1899 ఏప్రిల్ 2వ తేదీన శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసి 1900 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించారు. 125 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇక్కడ ఏటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. చర్చి నిర్మాణంలో జేబీ పెయిన్స్ కీలకంగా పనిచేయగా, తొలి బిషప్‌గా వి.ఎస్.సుందరయ్య వ్యవహరించారు. ఇక్కడ చర్చి నిర్మాణం జరిగాక ఈ ప్రాంతానికి చర్చి కాంపౌండ్‌గా పేరు వచ్చింది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖల సహకారంతో చర్చిని అభివృద్ధి చేయడమే కాక వైద్య, విద్యా సేవలు కూడా కొనసాగిస్తున్నారు. అనుబంధంగా కొనసాగుతున్న సెయింట్ మేరీస్ హాస్పిటల్(మిషన్ హాస్పిటల్)కు వివిధ జిల్లాల ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ఏటా జనవరిలో విదేశాల నుంచి వైద్యులు ఈ ఆస్పత్రికి వచ్చి చికిత్స అందిస్తుంటారు. ఆస్పత్రికి అనుబంధంగా డే కేర్ సెంటర్, పోలియో హోమ్ కొనసాగుతున్నాయి. అలాగే, సెయింట్ మేరీస్ పాఠశాల ద్వారా విద్యార్థులకు బోధన అందుతోంది.
అనుబంధంగా విద్య, వైద్య సేవలు


