బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన ఈగలపాటి శంకర్‌రావు(60) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన శంకర్‌రావు ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నా డు. జక్కేపల్లిలో ఉండే తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసి బైక్‌పై ఖమ్మం వస్తుండగా వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైనశంకర్‌రావు అక్కడికకక్కడే మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
కుక్కల దాడిలో పలువురికి గాయాలు
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో ఆదివారం వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో మేడికొండ రమణమ్మ, మేడికొండ మురళీధర్, ఎస్.కే.మస్తాన్‌తో పాటు మరో ముగ్గురికి గయాలయ్యాయి. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈనేపథ్యాన అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
పిడుగుపాటుతో దంపతులకు గాయాలు
● పెంపుడు కుక్క సహా 22 మూగజీవాలు మృతి
కారేపల్లి: పిడుగుపాటుతో ఇద్దరు జీవాల కాపరులకు తీవ్రగాయాలయయ్యాయి. ఈ ఘటనలో వీరు మేతకు తీసుకొచ్చిన 21 గొర్రెలు, ఒక కుక్క మృత్యువాత పడింది. మండలంలోని బాజుమల్లాయిగూడెంకు గొర్రెల కాపరులు మద్దెల లక్ష్మయ్య–లక్ష్మి 100జీవాలను సోమవారం సమీపంలోని పాటిమీదిగుంపు గ్రామంలో మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలు కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరగా వేపచెట్టుపై పిడుగు పడింది. దీంతో లక్ష్మ య్య–లక్ష్మి దంపతులు తీవ్రగాయాలతో స్పృహ కోల్పోగా, 17 గొర్రెలు, వారి పెంపుడు కుక్క మృతి చెందింది. అలాగే, పిడుగుపాటుతో చెట్టు సగం మేర కాలిపోయింది. అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన లక్ష్మయ్య ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు చేరుకుని వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి


