నేడు వాహనాల వేలంపాట | - | Sakshi
Sakshi News home page

నేడు వాహనాల వేలంపాట

May 6 2025 12:40 AM | Updated on May 6 2025 12:40 AM

నేడు

నేడు వాహనాల వేలంపాట

ఖమ్మంక్రైం: ఖమ్మం, సత్తుపల్లి ఎకై ్సజ్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఖమ్మం ఎకై ్సజ్‌ స్టేషన్‌–1 సీఐ కృష్ణ తెలిపారు. మొత్తం 18వాహనాలను వేలం వేయనుండగా, ఆసక్తి ఉన్న వారు ఈఎండీ చెల్లించి పాల్గొనాలని సూచించారు. వాహనం పొందిన వారు జీఎస్‌టీతో సహా నిర్దేశిత ధర చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో

నిరుపేదలకు ఊరట

ఖమ్మంవన్‌టౌన్‌: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం(సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఊరట లభిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఖమ్మం రూరల్‌, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 113 మందికి మంజూరైన రూ.40లక్షల విలువైన చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి సిఫారసుతో చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. నాయకులు సురేష్‌, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగం పేరుతో మోసం

మహిళపై కేసు నమోదు

కూసుమంచి: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3.29 లక్షలు కాజేసిన మహిళపై సోమవా రం కూసుమంచి పోలీసులు కేసునమోదు చేశా రు. కూసుమంచికి చెందిన దామళ్ల రామచంద్రయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడుకు చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి పరిచయం చేసుకుంది. రామచంద్రయ్య కుమార్తెకు ప్రభు త్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆయన నుంచి విడతల వారీగా రూ.3.29లక్షలు తీసుకు ని ముఖం చాటేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

కానిస్టేబుల్‌కు

రియల్‌ హీరో అవార్డు

సత్తుపల్లి: సత్తుపల్లి పోలీసుస్టేషన్‌లోని ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ ఎం.నరేష్‌కు ‘రియల్‌ హీరో’ అవార్డు లభించింది. ఓ టీవీ చానల్‌ ఆధ్వర్యాన ప్రకటించిన అవార్డుకు ఆయన ఎంపిక కాగా, హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చే తుల మీదుగా సోమవారం అందుకున్నారు. మార్చి 10వ తేదీన సత్తుపల్లిలో ఓ దొంగను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్‌ నరేష్‌ను తొ మ్మిది చోట్ల కత్తితో పొడిచినా వెనక్కి తగ్గకుండా నిందితుడిని బంధించారు. దీంతో ఆయనను ‘రియల్‌ హీరో’ అవార్డు అందించగా, ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీజీపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోడుభూములకు

సాగునీటి సదుపాయం

రెడ్కో మేనేజర్‌ అజయ్‌కమార్‌

చండ్రుగొండ: గిరిజనుల పోడు భూములకు సాగునీటి సదుపాయం కల్పిస్తామని, ఇందుకోసం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని రాష్ట్ర ఇంధన వనరుల పునురుద్ధరణీయ సంస్థ(రెడ్కో) ఉమ్మడి జిల్లా మేనేజర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఇందిర జల వికాసం పథకం ద్వారా పట్టాలు పొందిన వారి పోడు భూముల్లో వేయనున్న బోరుబావులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ ఒక్కో బోరుకు సోలార్‌ ప్లాంట్‌తోపాటు ఐటీడీఏ ద్వారా రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు భోజ్యానాయక్‌, బొర్రా సురేష్‌, ఫజల్‌ పాల్గొన్నారు.

నేడు వాహనాల వేలంపాట1
1/1

నేడు వాహనాల వేలంపాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement