స్టెమ్‌స్పార్క్.. అత్యుత్తమం
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని స్టెమ్‌స్పార్క్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్‌రావు, కృష్ణవేణి తెలిపారు. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంపీసీలో ఎ.హర్షిత 467 మార్కులు, సీహెచ్.హిమజ, పి.నాగసాయి అనిరుధ్ వర్మ 466, జి.గాయత్రి, సిహెచ్.సుషాంక్, వై.శ్రీరామ్ 465, బి.బ్రాహ్మణి 464మార్కులు సాధించగా, మిగతా వారు సైతం 400 నుంచి 450 మార్కులు సాదించారని వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్లతో పాటు అధ్యాపకులు అభినందించారు.


