ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆమె అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించాక అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికా రులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
నేలకొండపల్లికి చెందిన ఐతనబోయిన ఉమ సింగారెడ్డిపాలెం రెవెన్యూలో తన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన నంద్యాల శ్రీనివాసరావు ప్రభుత్వ సీలింగ్ భూమిని పేదలకు 1976–77లో పంపిణీ చేస్తే ఇప్పుడు ఆక్రమణకు గురైనందున చర్యలు తీసుకోవాలని కోరారు. వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సుబ్బమ్మ తన కుమారుడు 30 గుంటల భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున తిరిగి ఇప్పించాలని విన్నవించింది.
గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ శ్రీజ


