సైబర్.. అటాక్
రూ.15కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
రక్తసిక్తమైన రోడ్లు
నేరాల పట్టిక
ఈ ఏడాది పెరిగిన ప్రమాదాలు.. తగ్గిన చోరీలు
మహిళలపై వేధింపులు మాత్రం ౖపైపెకి..
ఇదే సమయాన పెరిగిన శిక్షల శాతం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఖమ్మం క్రైం: ఈ ఏడాది పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. చోరీల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినా మహిళలకు సంబంధించిన కేసులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ అందిన కాడికి దండుకున్నారు. చిన్నాచితక ఘటనలు మినహా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రత కల్పించిన పోలీసులు... పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసును నెలల తరబడి ఛేదించలేక అపప్రద మూటగట్టుకున్నారు.
పెరిగిన పోక్సో కేసులు
జిల్లాలో మహిళలు, చిన్నారులకు సంబంధించి కేసులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఒకటే పోక్సో కేసు నమోదైతే ఈసారి 15 కేసులు నమోదయ్యాయి. ఈవ్‌టీజింగ్ కింద కేసులు కూడా గత సంవత్సరం 17 ఉండగా.. ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. అత్యాచారం కేసులు గత ఏడాది 74 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 84కు చేరింది.
తగ్గిన దొంగతనాలు
పోలీసుల పెట్రోలింగ్, నిఘాతో చోరీ కేసులు తగ్గాయని చెబుతున్నారు. గత ఏడాది రూ.6.64 కోట్లకు పైగా సొత్తు చోరీ జరగగా, ఈ ఏడాది రూ.6.04 కోట్లకు పైగా సొత్తు దొంగతనానికి గురైంది. గత ఏడాది రూ.2.06 కోట్ల సొత్తు రికవరీ(31శాతం) చేసిన పోలీసులు ఈసారి రూ.2.40 కోట్ల సొత్తు రికవరీ (40శాతం) చేయగలిగారు. సీసీఎస్ పోలీసులు గత ఏడాది 84 దొంగతనాల కేసులను ఛేదించగా ఈసారి 105 కేసులను ఛేదించారు. అయితే, రికవరీ గత ఏడాది రూ.66.40 లక్షలు చేస్తే, ఈసారి రూ.55.20 లక్షలకే పరిమితమయ్యారు.
పెరిగిన శిక్షల శాతం
గత ఏడాది 4,398 కేసులు పరిష్కరిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 4,779కు చేరింది. గత సంవత్సరం 2,002 కేసుల్లో శిక్షలు పడగా.. ఈసారి 2,211 కేసుల్లో నిందితులకు శిక్ష వేయించగలిగారు. అలాగే, గత ఏడాది ఇద్దరికి జీవిత ఖైదు విధించగా, పకడ్బందీ చార్జిషీట్లు దాఖలు చేయడంతో అది 11కు పెరిగింది. ఇక 20 ఏళ్ల జైలుశిక్ష గత ఏడాది నాలుగు కేసుల్లో, ఈసారి ఐదు కేసుల్లో నమోదైంది. అలాగే, పదేళ్ల శిక్ష గత ఏడాది, ఈ ఏడాది ఒకరికే పడగా, ఏడేళ్ల శిక్ష ఇప్పుడు ఒకటి నమోదైంది. ఐదేళ్లలోపు శిక్షలు గత ఏడాది 33 కేసుల్లో పడగా.. ఈసారి 37 కేసుల్లో నిందితులకు విధించారు.
విచ్చలవిడిగా మత్తు పదార్థాలు
ఈ ఏడాది కమిషనేట్ పరిధిలో ఎన్‌డీపీఎస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది 37 కేసులు ఉంటే, ఈసారి 95 కేసులు నమోదయ్యాయి. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడంతో ఎన్‌డీపీఎస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని భావిస్తున్నారు. ఇక గత ఏడాది 384 కేజీల గంజాయిని సీజ్ చేయగా ఈసారి 295 కేజీలే స్వాధీనం చేసుకోగలిగారు.
ఈ సంవత్సరం సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కాయి. మొత్తం 2,197 ఫిర్యాదులు రాగా 1,805 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. గత సంవత్సరం 301 కేసులు నమోదైతే ఈ సంవత్సరం ఏకంగా 384 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం రూ.8.23 కోట్లకు పైగా నష్టపోతే, ఈసారి రూ.15.60 కోట్ల నగదును ప్రజలు కోల్పోయారు. అయితే, గత ఏడాది రూ.37 లక్షలకు పైగా రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈసారి ఏకంగా రూ.4.02కోట్లకు పైగా నగదును రికవరీ చేయడం విశేషం.
నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం, నిద్ర మత్తు, రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ ప్రమాదాల్లో వందలాది మంది మృతిచెందగా.. అంతకు మించి సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. హైవేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యాన వాహనాల వేగంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
నేరాలు 2024 2025
మహిళలకు సంబంధించి కేసులు 941 1,146
ఎన్‌ఫోర్స్‌మెంట్ 829 817
రోడ్డు ప్రమాదాలు 879 928
దొంగతనాలు 796 723
మిస్సింగ్ కేసులు 603 705
గాయాలు 693 809
మోసాలు 450 458
మహిళల మిస్సింగ్ 404 470
మహిళలపై వేఽధింపులు 362 516
రోడ్డు ప్రమాదాల్లో మృతులు 312 332
కిడ్నాప్ కేసులు 155 226
హత్యాయత్నాలు 41 40
చైన్‌స్నాచింగ్‌లు 34 28
హత్యలు 28 17
హత్య + దొంగతనాలు 02 01
లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం 18,224 36,709
ప్రశాంతంగా ఎన్నికలు
జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగగా పోలీసు కమిషనర్ సునీల్‌దత్ నేతృత్వాన ముందస్తు వ్యూహాలు అమలుచేయడంతో చిన్నాచితక ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. సెక్టార్లుగా విభజించి పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఇది సాధ్యమైంది.
కొత్త పుంతలు తొక్కిన ఆన్‌లైన్ మోసాలు
సైబర్.. అటాక్
సైబర్.. అటాక్
సైబర్.. అటాక్


