నాణ్యమైన డిజిటల్ సేవలు
కామేపల్లి: మహిళా శక్తి మోడల్ సీఎస్‌సీలు గ్రామీణ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని డీఐసీఎస్‌సీ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ బేతోజు హరికృష్ణకుమార్ తెలిపారు. కామేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కామేపల్లి, కారేపల్లి, ఏన్కూర్ మండలాల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం ద్వారా నిరుద్యోగ యువత, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు మోడల్, మహిళా శక్తి మోడల్ సీఎస్‌సీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి అభిషేకం..
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేకపూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆవరణలోని స్వామి వారి పాదాలకు అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.


