సత్వరమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
కొణిజర్ల: అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నందున ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. కొణిజర్ల మండలంలోని మల్లుపల్లి, తదితర గ్రామాల్లో ఆరబోసిన ధాన్యాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సత్వరమే అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించడమే కాక తడిసిన దాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. అనంతరం రామనర్సయ్యనగర్‌లో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జటపిట రవిని ఎమ్మెల్సీ పరామర్శించారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలికిలా వ్యవహరిస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ కొర్రా కాంతమ్మ, బీఆర్‌ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, పోగుల శ్రీనివాసరావు, దొడ్డపిన్ని రామారావు, ముల్యాల నాగేశ్వరరావు, కిలారు మాధవరావు, పాసంగులపాటి శ్రీనివాసరావు, చిరంజీవి, నాగేశ్వరరావు, రాంబాబు, సోందు, రాందాస్, వెంకన్న, నరసింహా రవీంద్ర, రహీం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


