నేడు దివ్యాంగులకు ఆటలపోటీలు
ఖమ్మంమయూరిసెంటర్: అంతర్జాతీయ దివ్యా ంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న దివ్యాంగులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి వి.విజేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంధులకు.. షాట్‌పుట్, రన్నింగ్, చెస్, బధిరులకు.. షార్ట్‌పుట్, జావలిన్‌త్రో, క్యారమ్స్, బుద్ధి మాంద్యం గల వారికి.. షాట్‌పుట్, రన్నింగ్ పోటీలు ఉంటాయని వివరించారు.
ఐఈఐ కాన్ఫరెన్స్‌కు
కేఎండీసీ అధ్యాపకురాలు
ఖమ్మంసహకారనగర్: 108వ ఇండియన్ ఎకానమీ అసోసియేషన్ (ఐఈఏ) ఆధ్వర్యంలో చైన్నైలో శనివారం జరుగుతున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తమ కళాశాల అధ్యాపకులు ఆషాబేగం హాజరై ‘ఇంపాక్ట్ ఆఫ్ సం మాక్రో ఎకనామిక్ పాలసీస్ ఇన్ యూస్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇంటర్ లింక్‌డ్ డెవలపింగ్ ఎకానమీ స్ట్రక్చర్’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల (కేఎండీసీ) సెక్రటరి కోటా అప్పిరెడ్డి తెలిపారు. డిగ్రీ కళాశాల సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ప్రిన్సిపాల్ రమణారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.
పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ శాఖలో ఏర్పడిన ఖాళీలను పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని తెలంగాణ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్–1104 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి తక్కిళ్లపల్లి శేషగిరిరావు అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని 1104 యూనియన్ కార్మిక భవనంలో సంఘం ప్రాంతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు సీతారామయ్య అధ్యక్షతన ప్రాంతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. సబ్‌స్టేషన్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిమ్మారావుపేట సబ్ ఈఆర్‌ఓకు బదులుగా కొత్తలింగాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అదనపు కార్యదర్శి పి.సురేశ్, ప్రతినిధులు శ్రీధర్, జీవీఎస్ శ్రీనివాస్, మాధవి, రమణ, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు దివ్యాంగులకు ఆటలపోటీలు


