చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన మంద రాజ్‌కుమార్ (40) ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాజ్‌కుమార్ తన కుమార్తెకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవటంతో మనస్తాపానికి గురై ఈనెల 18న పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడు నాగులవంచ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వీరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
గుండెపోటుతో రైతు మృతి..
తిరుమలాయపాలెం: అంతసేపు ట్రాక్టర్‌తో పొలం దున్ని నీళ్లు తాగేందుకు వెళ్లి వస్తూ ఒక్కసారిగా గుండెనొప్పితో పంటచేలోనే ఓ రైతు మృతిచెందిన ఘటన జూపెడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూపెడకు చెందిన బొల్లికొండ వెంకటేశ్వర్లు (52) తనకున్నట్రాక్టర్‌తో ఇతర రైతుల దుక్కులు దున్నేందుకు వెళ్తున్నాడు. శనివారం ఓ రైతు పొలం దున్నేందుకు వెళ్లగా మధ్యాహ్నం దాహం కావడంతో ట్రాక్టర్‌ని ఆపి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగి ట్రాక్టర్ వద్దకు వచ్చే సమయంలో గుండెనొప్పి వచ్చి అక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతుడికి భార్య లచ్చమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కోడి పందెం స్థావరంపై దాడి
సత్తుపల్లిరూరల్: మండలంలోని బుగ్గపాడులో శనివారం కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సత్తుపల్లి పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కోడి పందేలు నిర్వహించగా.. పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
డిసెంబర్ చివరి వారం నుంచి..
సంక్రాంతి పండగ సందర్భంగా డిసెంబర్ చివరి వారం నుంచి ఎక్కడో ఓ చోట కోడి పందేలు నిర్వహిస్తూనే ఉంటారు. తెలంగాణలో కోడి పందేలకు అనుమతి లేదు. ఏపీకి ఆనుకుని ఉన్న సత్తుపల్లి చు ట్టు పక్కల మారుమూల ప్రాంతాల్లో కోడి పందేలు వేస్తూనే ఉంటారు. ఆరు నెలల ముందు నుంచే రూ.5 వేల నుంచి లక్షల రూపాయల వరకు విలువ చేసే పందెం పుంజులను కొనుగోలు చేసి, బలవర్థకమైన ఆహారం అందించి,పెంచి, పందేలు వేస్తారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి


