హోరాహోరీగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కామేపల్లి: కామేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి నేతృత్వంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు.


